Socrates' contribution to philosophy

  • socrates biography pdf in telugu
  • సోక్రటీసు

    సోక్రటీస్ (ఆంగ్లం : Socrates: గ్రీకు | Σωκράτης ), Sōkrátēs; c. 469 BC–399 BC[1]) ( క్రీ.పూ 470 -క్రీ.పూ 399) గ్రీకు దేశంలోని ఏథెన్సుకు చెందిన తత్వవేత్త. పాశ్చాత్య తత్వానికి ఆద్యునిగా భావిస్తారు. ఈయన సృష్టించిన సోక్రటీసు విధి/పద్ధతి చాలా ప్రాచుర్యం చెందినది. ఈయన సృష్టించిన తత్వశాస్త్ర విధానంలో సాగే బోధనా విధానంలో ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్న విద్యార్థి మనసులోని మంచి సమాధానాన్ని, ప్రాథమిక భావనల్ని బయల్పరిచేదిగా ఉండాలి.

    సోక్రటీసు పాశ్చాత్య తత్వశాస్త్రం పై బలమైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ప్లేటో, అరిస్టాటిల్ పై ఈయన ప్రభావం ఎంతో ఉంది. నీతి నియమాలు, తర్క శాస్త్రంలో ఈయన ఎనలేని కృషి చేశాడు.

    సోక్రటిక్ సమస్య

    [మార్చు]

    సోక్రటీసు గురించి కచ్చితమైన సమాచారాన్ని రాబట్టడంలో పండితులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్నే సోక్రటిక్ సమస్య అంటారు. సోక్రటీసు గురించి సమాచారాన్ని జెనోఫోన్, ప్లేటో, అరిస్టాటిల్, అరిస్టోఫేన్స్ రచనల ఆధారంగా సేకరిస్తున్నారు. కానీ ఈరచనలు చాలా కళాత్మకమైనవై, తత్వశాస్త్ర భావనలతో కూడుకొని ఉండడం వలన వీటిని అర్థం చేసుకోవడానికి పండితులకు మంచి సృజనాత్